Monday, December 23, 2024

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: మన రాష్ట్రంలో ప్రతి పట్టణం ప్రగతి కాంతులతో కళకలలాడుతున్నాయని, ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పన దిశగా ప్రభుత్వం పటిష్ట చర్చలు తీసుకుందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరాణి సిద్దు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ట్రాక్టర్లు, స్వచ్చ ఆటోలతో మున్సిపల్ కార్మికులు సిబ్బంది, మెప్మా, కౌన్సిల్ సభ్యులు, కళాకారులు అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత వివిధ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలుసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహిస్తుందని, అందులో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు భూపాలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన పురపాలక చట్టాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేయడం జరిగిందని, దేశంలోనే అత్యుత్తమమైన పరీక్షలు నిర్వహించే యూపిపిఎస్ ఐఏఎస్ పరీక్ష నందు హైదరాబాద్‌ను 2020 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రి సిటీగా గుర్తించినారని, గత 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ పట్టణానికి ఈ విధమైన గుర్తింపు లభించలేదని అన్నారు.

అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధికి మీరందరూ సజీవ సాక్షమని, కెసిఆర్ దార్శనికత్వం మేరకు ఈ పట్టణం గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ, జిల్లాగా మారిందని అన్నారు. కౌన్సిల్ మెంబర్‌లు టీం వర్క్‌గా క్రియాశీలకంగా సేవలు అందిస్తున్నారని తద్వారా పట్టణం అభివృద్ధి జరుగుతుందని, వీరి కృషి, సహకారం, ఆలోచనల మేరకు ఈ రోజు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణాన్ని విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి, శాంతి భద్రతలు, ట్రాఫిక్ వంటి పలు అంశాలలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని, నాడు నేడు పరిస్థితులను, జరిగిన అభివృద్ధిని ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికి తెలుపుతూ భూపాలపల్లి పట్టణంలో నివసిస్తున్నందుకు గర్వపడాలని అన్నారు.

పట్టణ ప్రజలకు ఏదైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరాణి సిద్దు, జడ్పి వైస్ చైర్‌పర్సన్ కె శోభ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ అనిల్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News