Tuesday, January 28, 2025

జూలో టాయ్ ట్రైన్ ఢీకొని గవర్నమెంట్ టీచర్ మృతి

- Advertisement -
- Advertisement -

 

ఉత్తరప్రదేశ్‌: జూలో టాయ్‌ ట్రైన్‌ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఖాన్‌పూర్ నగరంలోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న అలెన్ ఫారెస్ట్ జూలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలిని అంజూ శర్మగా గుర్తించారు. 44 ఏళ్ల ఆమె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి జూ పార్కును సందర్శించిన అంజూ రైలు ఎక్కుతుండగా ప్రమాదానికి గురైందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిని బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News