Monday, December 23, 2024

ఎస్‌జెవిఎన్‌లో 4.9 శాతం వాటాను విక్రయించనున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యుత్ రంగానికి చెందిన మినీరత్న కంపెనీ ఎస్‌జెవిఎన్ లిమిటెడ్‌లో ఆఫర్ ఫర్ సేల్ ద్వా రా గురువారం ప్రభుత్వం 4.92 శాతం వాటాను విక్రయించనుంది. రెండు రోజు లు ఆఫర్ ఫర్ సేల్‌తో సేల్ చేయనుండగా, ఫ్లోర్ ధర రూ.69గా నిర్ణయించారు. ఎస్‌జెవిఎన్ లిమిటెడ్ రూ.1.18 లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వార్తతో ఎస్‌జెవిఎన్‌షేర్ ధర ఆరు శాతానికి పైగా పెరిగింది. ఈ షేర్ కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ షేర్ రూ.83 పైన ట్రేడవుతోంది. బిఎస్‌ఇ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఎస్‌జెవిఎన్ లిమిటెడ్ వివిధ ప్రాజెక్ట్‌ల కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి )తో ఒప్పందంపై సంతకం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News