Monday, December 23, 2024

ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర యువయజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మలక్‌పేటలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర యువజన సర్వీసుల విభాగం సహకారంతో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేదని. నో వెకన్సీ బోర్డుతో నిరుద్యోగులు తిప్పలు పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో జాబ్ మేళా ద్వారా ముంగిట వద్దకే వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కృషితో ఎన్నో బహుళార్ధ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. గతంలో బ్రతకడానికి దుబాయ్ , బొంబాయికి ఎంతో మంది పోయేవారని,  నేడు తెలంగాణకు వెళ్లి ఉద్యోగం చేయాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కొనియాడారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మలక్‌పేటలోని విద్యార్థులు, యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సుమారు 60 కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియమాక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎం.ఏ.సలాం షాహీద్, మినాజర్దీన్, నాయకులు షేక్ మొహియుద్దీన్, సైపుదీన్ షఫీ, అలీం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News