- Advertisement -
న్యూఢిల్లీ: పేదప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయిచింది. పిఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద ఆహారధాన్యాలు పంపిణీ చేయనున్నారు. మే-జూన్ లో 5 కిలీలో చొప్పున ఆహారధాన్యాల పంపిణీ చేయనున్నట్టు కేంద్ర సర్కార్ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆహారధాన్యాలకు తొలివిడుతలో రూ. 26వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఏకంగా 3 లక్షల మార్కును దాటాయి. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కోవిడ్-19 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది.
government will provide free food grains to poor
- Advertisement -