Thursday, January 23, 2025

ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది: మంత్రి దామోదర రాజ నర్సింహ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మెడికల్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ శాఖ ఉద్యోగులు ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం అందిస్తున్న సేవలలో వైద్యారోగ్య శాఖలోని గెజిటెడ్ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధికారులు రూపొందించిన డైరీ క్యాలెండర్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కలిముద్దీన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు, రామాంజనేయులు, కోశాధికారి చంద్రశేఖర రావు, నరసింహారెడ్డి, నామాల శ్రీనివాసులు, మంజుల, విజయనిర్మల , రాజ్ కుమార్, చిట్టిబాబు, మురళీధర్ రెడ్డితో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News