- Advertisement -
హైదరాబాద్: తాను సెక్యూరిటీ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కేంద్ర హోంశాఖ పై కేటగిరీ సెక్యూరిటీ కేటాయింపుపై మాట్లాడుతూ తనకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో ఇంకా తెలియదన్నారు. తనపై గతంలో దాడులు జరిగిన విషయాలన్నీ జాతీయ నాయకుల దృష్టిలో ఉందని దాని ఆధారంగా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నాయకులు ఫోన్లు చేసి తన ఆరోగ్య పరిస్థితిపై పలకరించారని చెప్పారు. తనపై జరిగిన దాడులను విశ్లేషించి అధికారులే ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. గతంలో జరిగిన దాడులు, పరిణామాలను అధికారులకు వివరించినట్లు ఆయన తెలిపారు. అనంతరం అధికారులు చాయ్ తాగి వెళ్లి పోయారన్నారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వై ప్లస్ కేటగిరీ భద్రత కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే.
- Advertisement -