Thursday, January 23, 2025

ట్రాఫిక్ సమస్యలు వద్దు…ఈ ఫార్ములా రేస్‌పై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకుండా గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని టిపిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు. వీటిని దృష్టిలో ఉంచుకునే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో ఫార్ములా ఈ రేస్‌తో ట్రాఫిక్ నానా ఇబ్బందుల పాలైందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ రేస్‌లే కావాలా? మా ఇబ్బందులు పట్టవా? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసినా నాటి బిఆర్‌ఎస్ పాలకులు పట్టించుకోనే లేదన్నారు. ఈ ఫార్ములా రేస్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించామని ట్విట్టర్‌లో బిఆర్‌ఎస్ మంత్రులు పోస్ట్ చేసుకుంటున్నారని.. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు.

ఫార్ములా ఈ రేస్ అనేది ..ఒక రావణ క్రీడ..అనేదే తన భావన అన్నారు. దీనిపై ఈ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ఫార్ములా ఈ క్రీడ బిఆర్‌ఎస్ వారిని ఆనందడోలికల్లో ముంచుతుందేమో గానీ ప్రజలకు ఏమాత్రం ఆనందం ఇవ్వలేదన్నారు. ఇద్దరు రాజీనామాతో ఎంఎల్‌సి ఎన్నిక వచ్చిందని చెబుతూ ఇది సాధారణ ఎన్నిక కాదని, ఇది ఉప ఎన్నికనేనన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉప ఎన్నిక జరుగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News