Friday, December 27, 2024

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : పేద ప్రజల అభివృద్ధ్ది, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో రూ.6 కోట్ల 45 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన పలు కార్యక్రమాలను గురువారం ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ ప్రారంభించారు. డబుల్ బెడ్ రూమ్, సిసి రోడ్లు, మురికి కాలువలు, బస్తీ దవాఖానా, టెంపుల్ కాంపౌండ్ వాల్, క్రీడా ప్రాంగణం, కుల సంఘాలకు కమిటీ హాల్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధ్ది కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయన్నారు. వచ్చే నెట నుండి వికలాంగులకు 4016 రూపాయలలు తెలంగాణ ప్రభుత్వం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పేద ప్రజల సంక్షేమం కోసంమే సంక్షేమ పథకాలు, అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. సబ్బండ వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News