Monday, December 23, 2024

సహకార సొసైటీల అభివృద్ధికి సర్కార్ చేయూత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన సహకార సంఘాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆ సంఘాలలో సభ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇతోదికంగా కృషి చేస్తున్నదని పలువురు సహకార సంఘాల సమాఖ్య చైర్మన్లు అన్నారు. ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, కల్లు గీత కార్మికుల సమాఖ్య చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్లు మేకల వృత్తిదారుల సహకార సంఘం సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఈ మేరకు శక్రవారం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం బలహీన వర్గాల వృత్తిదారుల సంక్షేమానికి అమలు జరుపుతున్న పథకాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని వెనుకబడిన తరగతుల వృత్తిదారుల అభివృద్ధి లక్ష్యంగా కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు జరుపుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు.

వెనుకబడిన తరగతులకు చెందినట్లు చెప్పుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేయలేదని కులవృత్తులలో ఆధునిక టెక్నాలజీ పేరిట విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి గ్రామీణ ప్రాంతాలలోని కుల వృత్తులకు ఆదరణ లేకుండా చేసిందని విమర్శించారు. కానీ బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న కెసిఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని కులవృత్తులను పునరుద్ధరించడానికి వేలాదికోట్ల రూపాయల నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని వారు ఈ సందర్భంగా కోరారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రాంతంలో కూనరిల్లిపోయిన కులవృత్తులను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే ధ్యేయంతో కల్లుగీత కార్మికులకు, గోర్లు మేకల పెంపకం దారులకు, మత్స్యకారులకు, చేనేత కార్మికులకు మరియు చేతివృత్తులదారులకు, అత్యంత వెనుకబడిన కులాలకు అనేక పథకాలను అమలు జరిపి వారి సంక్షేమానికి మరియు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పిట్టల రవీందర్, పల్లె రవికుమార్ గౌడ్, డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News