Saturday, December 28, 2024

గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

ఓదెల: గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని లంబాడి తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గ్రామపంచాయతీ ఆవరణలో గిరిజన దినోత్సవ గ్రా మసభలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు వివిధ కార్యక్రమాల ద్వారా వివరిస్తూ, నూతన లంబాడి తండా గ్రామపంచాయతీలో జరిగి న అభివృద్ధిని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన జనాలు తక్కువగా ఉన్నందున వాటిని గ్రామపంచాయతీ లుగా గుర్తించి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయించారన్నారు. గిరిజనుల కోసం ట్రై కార్ రుణాల కింద రూ.35 లక్షల సబ్సిడీతో యూనిట్లను మంజూరు చేశామని తెలిపారు. ఎస్సారెస్పీ భూములు, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారని, పా అసైన్‌మెంట్ చే ఉన్నట్లయితే వెంటనే పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గిరిజనులకు వంద యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నదని, వైర్లు తగిలించుకొని విద్యుత్ ప్రమాదాలకు గురి కావద్దని కోరా రు. మండల కేంద్రం నుంచి లంబాడి తండా వరకు బస్సు సౌకర్యం కల్పించేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా చర్యలు పటిష్టంగా అమలు చేస్తాయినని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కనీస మౌళిక సదుపాయాలు ఉండేవి కావని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు గిరిజనుల దరికి చేరాయని గుర్తు చేశారు. లంబాడి తండా గ్రామంలో రూ.4.30 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణ పను లు పూర్తి చేశామని, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశామని, మరో పది లక్షలు సీసీ రోడ్ల కోసం ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసుకున్న లంబడా తండా గ్రామపంచాయతీలో 12.41 లక్షలతో స్మశాన వాటిక, రూ.2.30 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2.39 లక్షలతో పల్లె ప్రకృతి వనం, నూతన ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపా రు. గ్రామంలోని మహిళా సంఘాల కోసం మహిళా భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపా రు. అంతకుముందు గ్రామంలో నుండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు.

సభా ప్రాంగణంలో లంబాడి తండాలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చాయ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఎంపీడీఓ, మండల పంచాయతీ అధికారి, సర్పంచ్ గుగులోత్ లక్ష్మీ, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ట్రైబెల్ వెల్ఫేర్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News