Monday, January 20, 2025

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మనిగిళ్ల గ్రామ రైతులు కలిసి చౌట చెరువు నుంచి నీరేటి గ్రామం వరకు ఫార్మేషన్ రోడ్, చెరువు, అలుగు దగ్గర కాజ్‌వే బ్రిడ్జి నిర్మాణం కోసం వినతిపత్రం సమర్పించారు. రోడ్డు వేస్తే సుమారు వెయ్యి ఎకరాల రైతులకు లాభం జరుగుతుందని మంత్రిని కోరారు.

మంత్రి వర్యులు వెంటనే స్పందించి ఈ నెల 16వ తేదిలోపల గ్రామాన్ని సందర్శించి త్వరలోనే కాజేవే బ్రిడ్మి నిర్మాణం, ఫార్మేషన్ రోడ్డు వేసి తీరుతామని, రైతుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ నిలబడుతుందని, రైతుల సంక్షేమమే మా లక్షమని అన్నారు. త్వరలోనే రోడ్డు మంజూరు చేయడం జరుగుతుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు కొండ రవీందర్ రెడ్డి, మద్దిలేటి, మాజీ ఎంపిటిసి నర్సింహా రెడ్డి, డైరెక్టర్ రామ్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, గ్రామ రైతులు దర్గాసత్తి, రాములు, బోయిని కృష్ణ, సత్యారెడ్డి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News