Monday, December 23, 2024

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని స్థానిక గిరజన భవన్‌లో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహిళా అభ్యున్నతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. పేదింట ఆడపిల్ల వివాహ సమయంలో కుటుంబానికి ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు గాను కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,016లను అందజేస్తుందని, మెరుగైన వసతులతో విద్యా సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.

అనంతరం పలు శాఖలకు చెందిన మహిళ అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, బండి పుల్లారావు, సోయం ప్రసాద్, పైడి వెంకటేశ్వరావు, దొడ్డాకుల రాజేశ్వరావు, సిడిపిఓ రోజారాణి, సూపర్‌వైజర్‌లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News