Sunday, December 22, 2024

దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

గట్టు : ప్రభుత్వం ధళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆరగిద్ద గ్రామంలో గ్రామానికి చెందిన నర్సింహులు ధళిత బంధు పథకానికి ఎంపికై రూ. 10 లక్షల వ్యయంతో శివ అనే పేరుపై కోళ్ళఫారం మంజూరు అయ్యింది.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదివారం పార్టీ నేతలతో కలసి కోళ్ళ ఫారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ దళితుల ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి 10 లక్షలు ప్రకటించారన్నారు. గత 50 ఏళ్ళ ప్రభుత్వాల పాలనలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదని గుర్తు చేశారు. దళితలను ఓట్లు వేసే యంత్రంగా మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప వారి అభ్యున్నతికి పాటుపడలేదన్నారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చేర్మన్ జంబు రామన్ గౌడ్, ఎంపిపి విజయ్ కుమార్,పిఎసిఎస్ చేర్మన్ క్యామ వెంకటేష్,బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News