Wednesday, January 22, 2025

మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్‌పేట్: మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ముస్లిం గ్రీన్‌యార్డ్ ప్రహారి గోడ కమ్యూనిటీ హాల్, ఉర్థూ భవనం, ఈద్గాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 30 లక్షల నిధుల మంజూరుతో పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, మర్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మహిపాల్, కుశాల్‌కుమార్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News