- మంత్రి చామకూర మల్లారెడ్డి
ఘట్‌కేసర్: వికలాంగుల అభ్యునతికి తెలంగాణ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని శివాస్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని వికలాంగులకు 3116 ఉన్న పింఛన్ 4116 పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం దివ్యాంగులతో సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు నర్రి ధనలక్ష్మీ, చింతల రాజశేఖర్, సింగిరెడ్డి సాయిరెడ్డి, ఆకిటీ శైలజ, బైరా హిమా, మెట్టు బాల్‌రెడ్డి, నల్లవెల్లి లక్ష్మీ, సుర్వి సుధాలక్ష్మీ, బద్దం మమత, జగన్‌మోహన్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మందడి సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడె ంట్ గొంగళ్ళ బాలేష్, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, కాశయ్య, అబ్బవతి నర్సింహా, మోటుపల్లి శ్రీనివాస్, కెఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.