Wednesday, January 22, 2025

ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డివిజన్ కేంద్రంలోని మసీదులో మంత్రి దయాకర్‌రావు ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. పేదరికం తొలగాలన్న సమున్నత లక్షంతో సీఎం కేసీఆర్ పేద మైనార్టీ యువతల వివాహాల కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.లక్ష116లు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

సీఎం కేసీఆర్ పేద ముస్లింల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. డివిజన్ కేంద్రంలోని మసీదులో అన్ని ఏర్పాట్లు కోసం కోటి రూపాయలు వెచ్చించడం జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ, జెడ్పీప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, డీఎస్పీ రఘు, ఎస్‌ఐలు గండ్రాతి సతీశ్, రాజు, నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News