Thursday, January 23, 2025

గ్రామాభివృద్ధికి ప్రభుత్వ కృషి

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి : గ్రామాల అభివృద్ధే లక్షంగా బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 50 లక్షల రూ పాయలతో బాలుర ప్రాథమిక పాఠశాలలో అదన పు తరగతి గదులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివా స్ యాదవ్‌కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మా ట్లాడుతుంటే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంతోష ం వ్యక్తం చేశారు.

గత పాలకుల పాలనలో సర్కార్ బడికి రావాలంటే బయపడేవాళ్లని,నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థి అ నర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడడం కెసిఆర్ పాలన కు నిదర్శనమన్నారు.యశ్వంత్‌అనే విద్యార్థి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తుంటే ఆశ్యర్యం వ్యక్తం చేసిన ఎ మ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి తెలంగాణప్రభుత్వం చేపట్టిన స ంక్షేమ పథకాల గురించి తెలుసు కాని ప్రతిపక్ష పా ర్టీల నాయకులకు మాత్రం తెలియదు అంటూ ఎ ద్దేవా చేశారు. విద్యార్థులకు మంచి విద్యాబోధన అ ందజేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.
యాదవ కమ్యూనిటీ హాల్ ప్రారంభం…
అనంతరం వట్టెం గ్రామంలో తన సిడిపి నిధులు 12 లక్షలతో కొత్తగా నిర్మించిన యాదవ కమ్యూనిటి హాల్‌ను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఎ లా ఉండేదో ఒకసారి ఆలోచించాలని, నూటికి 50 శాతం ఉన్న మహిళలు తాగునీళ్ల కోసం బోరింగ్‌లు కొట్టి కొట్టి చేతులు పోయాయని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటి ముందే మి షన్ భగీరథ నీళ్లు తెచ్చి మహిళల కష్టాలు తీర్చామ ని అన్నారు. మూడు పంటలకు కరెంట్ ఇస్తున్న కెసిఆర్ కావాలా, మూడు గంటల కరెంట్ ఇస్తామ న్న కాంగ్రెస్ కావాలా ఆలోచించాలని కోరారు.

గ తంలో ఎవరైనా చనిపోతే ఆపద్భాందు పథకం కిం ద 50 వేలు ఇస్తుండే అని అది కూడా కట్నాలు పో ను చేతికి 20 నుంచి 30 వేల వరకు వచ్చేదని, కా నీ నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు చనిపోతే కారణం అడగకుండా 11 రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కె సిఆర్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ ప్రజలు సిఎం కెసిఆర్ పాలనలో ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నారన్నారు.24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీ మా, సాగునీళ్లు ఇస్తున్న ప్రభుత్వం కావాలా వద్దా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని, కాంగ్రెస్ పా ర్టీ మోసపూరిత హామీలు నమ్మి మోసపోవద్దని, నా గర్‌కర్నూల్‌కు మెడికల్ కళాశాల తెచ్చానని, ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో చేస్తున్నామని తెలిపారు.

నా సొంత నిధులతో పేద ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేస్తున్నాని, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అం దించాలని స్కూల్స్ కడుతున్నానని ఎమ్మెల్యే తెలిపా రు.నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో ఒక ఎకరాస్థలంలో యాదవ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు మ హిళా సంఘం భవనాన్ని నిర్మించేందుకు 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News