Friday, January 10, 2025

మహిళ సాధికారతకు ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : మహిళ సాధికారతకు కృషి చేస్తు మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని మహిళ కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బలంరాయి క్లాసిక్ గార్డెన్‌లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో మహిళా వికాస్‌సంఘ్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి బిఅర్‌ఎస్ పార్లమెంట్ మల్కాజ్‌గిరి ,కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి , బేగంపేట్ షీటీం సిఐ ధనలక్ష్మీ, సిఐ శ్రీనివాస్‌లు ముఖ్య అథిధులగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమంను ప్రారంభించారు.

ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల భద్రతకు షీటీమ్స్, కెసిఅర్ కిట్, కళ్యాణలక్ష్మీ, షాధీ ముభారక్ పథకాలు నిదర్శనమని అన్నారు. బాలికల విద్యకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు మహిళలల అభ్యున్నతికి వడ్డీలేని రుణాలు,అంగన్‌వాడి టీచర్లుకు జీతాల పెంపు, పండుగలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు చేయటమే అని అన్నారు. కెసిఅర్ ,కెటిఅర్‌ల స్పూర్తితో మాఅమ్మపేరు మీద అరుందతి ఆసుపత్రిని ప్రారంభించి పేదవారికి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నామని మర్రిరాజశేఖర్‌రెడ్డి పేర్కోన్నారు.

అరుందతి ఆసుపత్రితో సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్ చైర్‌పర్సన్ హరీక ఆనంద్‌బాబు, మార్కెట్ డైరెక్టర్ నయిం, బిఅర్‌ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, మహిళ వికాస్ సంఘ్ సభ్యులు మ ంజు,రేఖా, శైలాజ, భాగ్య, సంద్య,మమత, ప్రవీణ్‌యా దవ్, శ్రీకాంత్, సోమయ్య,సురేష్ తదితరులు పా ల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News