Saturday, December 21, 2024

రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణకు ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • 2కె రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
    తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రత పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించి పోలీసులు, నాయకులు, యువకులతో కలిసి పరుగులు పందెంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు ప్రభుత్వం కృషి చేస్తూ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, డీఆర్‌డీవో పీడీ కిరణ్ కుమార్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్‌రావు, సీఐ నాగార్జునగౌడ్, తుంగతుర్తి ఎస్సై దానియల్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కటకం వెంకటేశ్వర్లు, పరమేష్, పెరకమల్ల రవి కుమార్, వివిధ మండలాల ఎస్సైలు, పోలీసులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News