Thursday, January 23, 2025

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

మంచాల:ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన కొండూరి సతీష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.5 లక్షల ఎల్‌ఓసి పత్రంను శుక్రవారం బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ఆరుట్ల గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు పుణ్ణం రాము, బైకని మహేందర్, నాయకులు ఐలయ్య, శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News