కరీంనగర్ :యువతకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో నిర్వహిం చిన విద్యాదినోత్సవంలో ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో 75 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవన తాత్కాలిక షెడ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మకమైన ప్రగతి సాధించా మని మంత్రి తె లిపారు. గ్రంథాలయాలు జ్ఞాన సంపద ఒక నిల యాలని అన్నారు. గ్రంథాలయాల ద్వారా ఎంద రో ఉన్నత ఉద్యోగాలు సాధించార ని అన్నారు. ప్ర భుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాల తో యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొని మంచి ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తుం దన్నారు. కుల మతాలకు అతీతంగా ఉత్సవాలు ని ర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ అవ తరణ దశాబ్ది వేడుకలను నిర్వహి స్తున్నారన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల భవి ష్యత్తు బాగుండాలని ఆశీర్వదించారు. తెలంగాణ రాకముందు ఇక్కడ భయం కరమైన పరిస్థితులు ఉండేవని తాగునీటి కోసం ఖాళీ బిందెలతో కి లోమీటర్ల దూరం నడిచి వెళ్లిన రోజులు ఇంకా గు ర్తున్నాయని, కరెంటు ఎప్పు డు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలు ఉండేవని, సమైక్య పాలనలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కు కేవలం లైబ్రరీలే ప్రధాన వనరులని ఇప్పు డున్నట్టు గూగుల్ అప్పుడు లేదన్నారు.
సమైక్య పా లనలో దేవాలయాల లాంటి లైబ్రరీలు నిరా ద రణకు గురయ్యాయని తెలిపారు. స్వయ పాల న లో గ్రంథాలయాలకు పునర్జీవం పోస్తున్నామని చ దువుకోవాలని అందరికీ ఉంటుంది కానీ చ దు వుకునే స్తోమత కొంత మందికే ఉంటుందని, చ దువుకునే స్తోమత లేని వారిని ప్రభుత్వమే చ ది విస్తుందన్నారు. గ్రంథాలయాలను సద్విని యో గం చేసుకొని నేటితరం ఉద్యోగాలు సాధించా ల న్నారు. మన ఉద్యోగాలు మనకే ఉన్నాయని, ఉ ద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధం కా వా లన్నారు. తెలంగాణ సంపన్న రాష్ట్రం అన్ని రం గా ల్లో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకు పో తుం ద న్నారు. హైదరాబాద్ తర్వాత ఏసి గ్రం థాలయం ఉంది కరీంనగర్ లోనే అని తెలిపా రు. గ్రం థాలయంలో ప్రిపేర్ అయి ఐఏఎస్,ఐపిఎస్ లు కావాలన్నది సిఎం కెసిఆర్ ఆకాంక్ష అని అ న్నా రు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడు తూ గ్రం థాలయాలు జ్ఞానబండాగారాలని నిరుద్యోగ యు వత వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు.
కరీంనగర్ జిల్లా గ్రంధాలయంలో పోటీ పరీక్ష లలో రాణించేందుకు కల్పించడం జరిగిం దన్నా రు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలోని రీ డింగ్ రూమ్ లలో రాష్ట్రంలోనే తొలిసారి ఏసీలు ఏ ర్పా టు చేయడం జరిగింది అన్నారు. ఈ గ్రం థా లయం24×7 గంటలు పని చేస్తుందని అన్నా రు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రా ణిం చేందుకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరి గిం దన్నారు. పోటీ పరీక్షలకు కష్టపడి చదివి ఉ ద్యో గాలు సాధించాలన్నారు. కరీంనగర్ వారధి సొ సైటీ ద్వారా గ్రంథాలయానికి పుస్తకాలు, ఫర్ని చ ర్, ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసి ఇవ్వ డం తో పాటు విద్యార్థులకు భోజనం అందించడం జ రుగుతుందన్నారు.
వారధి సొసైటీ ద్వారా కరీం న గర్ జిల్లా గ్రంధాలయానికి29 లక్షల 75 వేల 82 9 విలువగల 4056 పుస్తకాలు, 12ఎయిర్ కం డిషనర్లు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కొరకు1 లక్ష రూపాయలు అందించడం జ రిగిం దన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొ న్నం అనిల్ కుమార్ గౌడ్ గ్రంథాలయంలో కల్పి స్తున్న సౌకర్యాలు, వసతుల గురించి వివ రించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ అనిల్ కు మార్ గౌడ్, మున్సిపల్ డి ప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి వేణి మ ధు, ఎక్స్ ఎమ్మెల్సీ నా రదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రం థాలయ సంస్థ కార్యదర్శి ఏ సరిత, కా ర్పొరేటర్లు బండారి వేణు, వాల రమణారావు, గం దే మాధవి తోట రాములు అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.