Monday, January 20, 2025

67 కోట్ల మంది డేటా చోరీపై ప్రభుత్వ వివరణ తప్పనిసరి : కాంగ్రెస్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దాదాపు 67 కోట్ల మంది వ్యక్తిగత సమాచార డేటా చోరీపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిమాండ్ చేసింది. ఇది భారతీయుల వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రతపై దాడిగా నిర్ధారించింది. 24 రాష్ట్రాలు, 8మెట్రోపాలిటన్ సిటీల్లో దాదాపు 66.9 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని , సంస్థల సమాచారాన్ని కాజేసిన ఫరీదాబాద్‌కు చెందిన నిందితుడు వినయ్ భరద్వాజ్‌ను శనివారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంది. ఈ మీడియా రిపోర్టును టాగ్ చేసి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విటర్ ద్వారా హిందీలో ప్రభుత్వాన్ని నిలదీశారు.

67 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం ఎలా ఎందుకు చోరీ అయిందని , అలాగే ఆర్మీ డేటాను ఎవరు ఎలా కాజేశారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధమైన దాడి అంగీకారం కాదని, ప్రభుత్వం తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పోలీస్ శాఖ నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. నిందితుడు వినయ్ భరద్వాజ్ సాంకేతిక విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, జిఎస్‌టి, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రధాన సంస్థల కన్సూమర్ /కస్టమర్ డేటా కాజేశాడని పేర్కొన్నారు. 104 కేటగిరీలుగా భద్రపర్చిన ఈ సమాచారాన్ని విక్రయిస్తుండగా శుక్రవారం నిందితుడు అరెస్ట్ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News