Sunday, December 22, 2024

ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాలకు పరిమిత హక్కులు

- Advertisement -
- Advertisement -

అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటే కుదరదు సుప్రీంకోర్టు
రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు

న్యూఢిల్లీ :ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వహక్కుల పరిధి ఎంతవరకు అనే అంశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించిం ది. అన్ని పైవేట్ ఆస్తులపై రాష్ట్రప్రభుత్వాలకు హక్కులు ఉండబోవని అత్యున్నత న్యాయస్థా నం తేల్చి చెప్పింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేసేందుకు గాను అన్ని ప్రై వే ట్ ఆస్తులను స్వాధీనం చేసుకోజాలవని స్ప ష్టం చేసింది.ఈమేరకు రాజ్యాంగంప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు లేవని స్ప ష్టం చేసింది. ఈమేరకు 9 మంది జడ్జీలతో కూడి న ధర్మాసనం 8:1 మెజారిటీతో ఈ తీ ర్పు ఇ చ్చింది. కొన్ని కేసుల్లో మాత్రం మినహాయిం పు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కీలక తీర్పును సిజెఐ డివై చంద్రచూడ్ ప్రకటించారు.

రాజ్యాంగంలోని  ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ యాజమాన్యం లోని అన్ని వనరులను రాష్ట్రం స్వాధీనం చేసుకునే హక్కు లేదన్నారు. ఈమేరకు గతంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఇ చ్చిన తీర్పును మెజారిటీ తీర్పు తోసిపుచ్చింది. ఆర్టికల్ 39(బీ) ప్రకారం ప్రైవేట్ ఆస్తులను సమాజ ముఖ్య వనరులుగా పరిగణించవచ్చా? పంపిణీ కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవచ్చా? అనే న్యాయపరమైన ప్రశ్నలపై సీజే చం ద్రచూడ్‌తోపాటు మరో ఏడుగురు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పు ఇచ్చా రు. ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్రాలు అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చే సుకోవచ్చంటూ గతంలో వెలువడిన అన్ని తీర్పులను జడ్జీలు తోసిపుచ్చారు.“ ఏ ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సమాజ వనరులే. ఈ రెండూ పరస్పర భిన్నమైన విధానాలు. వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్ర యోజనాలను దృష్టిలో ఉంచుకుని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది” అని అభిప్రాయపడింది.

“ 1950లో దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయి. ఇది పరివర్తన. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొ త్తగా ఉండాలి. ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి. ”అని ధర్మాసనం పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ దీని పై తీర్పు వెలువరించింది. అలాగే కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసమంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకున్న కేసులోనూ సుప్రీం తీర్పునిస్తూ “ చట్టప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ నష్టపరిహారం చెల్లించినా సరైన పద్ధతు లు మాత్రం పాటించలేదు. వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొ లగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. నిర్బంధ స్వాధీనాలు, హ డావుడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదు” అని ధర్మాసనం తెలిపింది. ఆస్తి స్వాధీనం విషయాన్ని ముందుగా తెలియజేయడం, తగినంత సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ప్రజా ప్రయోజనం కోసమేనని వివరించడం వంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News