Monday, December 23, 2024

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవాబుపేట: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని దత్తాపూర్ గ్రామంలో రూ.64 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి బిటీ రోడ్డు, కాలనీల్లో సిసి రోడ్లు వేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జయమ్మ, ఎంపిపి కాలే భవాని, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, సర్పంచులు విజయలక్ష్మి, బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News