Monday, December 23, 2024

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జహీరాబాద్ ఎమ్మెల్యేకొనింటి మాణిక్‌రావు అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో సోమవారం డిసిఎంఎస్ రైతు సేవాకేంద్రంలో ఉమ్మ డి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ సీడ్స్ పంపిణీ కేంద్రాన్ని డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల కాలంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాని తెలంగాణప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్నారన్నారు.

అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై విత్తగనాలను అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా రైతు సంక్షేమమే లక్షంగా రైతు బంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్ తదితర పథకాలు అందిస్తూ రైతులను ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న పథకాలను అర్హులైన రైతులందరూ సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బిక్షపతి, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ ఎంపిపి విజయ్ కుమార్, ఇప్పెపల్లి పిఎసిఎస్ చైర్మన్ దాసరి మచ్చేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మంకాల్ సుభాష్, అల్లాడి నర్సింలు, కేతకి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దీన్, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, బెజుగం సతీష్,సీనియర్ నాయకుడు వైథ్యనాథ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News