Tuesday, January 21, 2025

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

ములుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ములుగు జడ్పి చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ములుగు ఎంఎల్‌ఏ సీతక్కతో కలిసి రూ.35.3లక్షల డిఎంఎఫ్‌టి నిధులతో మొదలుకానున్న కోట కాలువ మరమ్మతు పనులను, లక్ష్మీపురం గ్రామంలో రూ.14లక్షలతో పెద్ద చెరువు మరమ్మత్తు పనులను ప్రార ంభించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సు భిక్షంగా ఉండాలని ప్రభుత్వం నీటి పారుదల వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ద్ద పెట్టి నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేసిందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాస్, స్థానిక ఎంపిపి సూది శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటిసిలు వెలిశాల స్వరూప, లావుడ్యా రామచంద్రు, లక్ష్మీపురం సర్పంచ్ లావుడ్యా స్వాతి, ఉప సర్పంచ్ వెంకన్న, బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లకావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపిటిసి లకావత్ చందులాల్, లక్ష్మీపురం గ్రామ అధ్యక్షులు జిల్లెల కొమురయ్య, పస్రా గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్, కర్లపల్లి జిపి అధ్యక్షుడు వజ్జ నరేందర్, అజిజ్, మండల ఉపాధ్యక్షుడు రాజు, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు భద్రయ్య, రసపుత్ లింగయ్య, బానోత్ సంతోష్, రసపుత్ హనుము, రఘు, రాం సమ్మయ్య, రమేష్, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News