Saturday, December 21, 2024

ఆకుపచ్చ తెలంగాణగా నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్పీడీసీఎల్ సిఎండి అన్నమునేని గోపాల్ రావు, డైరెక్టర్లు వివిధ పూల మొక్కలను (నూరు వరాలు, మంధార, ఎల్లో అలబంధ, క్రీం అలబంధ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సి.యం.డి అన్నమనేని గోపాల్‌రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో వృక్షాలు, వనాలతో పచ్చదనంగా మారిందని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్వాములవ్వాలన్నారు. మొక్కలు నాటి భావితరాలకు కాలుష్యరహిత భవిష్యత్తును అందించాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రోజు రోజుకు వాతవరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రించడానికి హరిత వనాలు అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని అన్నారు. మనం మొక్కలు నాటడమే కాకుండా ముఖ్యంగా మన పిల్లలతో మన ఇంటి ఆవరణలో కూడా మొక్కలను నాటించి సంరక్షించడం ఒక అలవాటుగా నేర్పించాలని అన్నారు.

మొక్కలను, చెట్లను కాపాడితే మనల్ని కాకుండా మన భావితరాలను కూడా కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, ఇంచార్జ్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.జనార్ధన్, సి.జి.యంలు అశోక్ కుమార్, సదర్ లాల్, మోహన్ రావు, కిషన్, ప్రభాకర్, రాజుచౌహాన్, కె.ఎన్.గుట్ట, రవీంధ్రనాథ్, బీకంసింగ్, జి.యంలు, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, ఎస్‌ఈ సివిల్ అంకుస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News