Monday, December 23, 2024

స్మశాన వాటికల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: స్మశాన వాటికలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని 40వ డివిజన్ కార్పోరేటర్ మరుపల్ల రవి అన్నారు. ఆదివారం ఉర్సు హిందూ స్మశాన వాటికలో మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల నిధులతో బోరింగ్‌కు కార్పొరేటర్ మరుపల్ల రవి శంకుస్థాపన చేశారు. డివిజన్‌లోని అన్ని స్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజ య్, స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఆవునూరి రామ్మూర్తి, బైరి రాజు, ఆవునూరి నాగరాజు, పసునూరి నాగరాజు, పోగుల రాజు, పసునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News