- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం: మహిళా సాధికారతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మాదారం గ్రామంలోని కొలను అనంత్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లోని మహిళలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. బతుకమ్మ ఆటపాటలు కోలాటాలతో ఫంక్షన్ హాల్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక మహిళలకు సమచిత స్థానాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. నేడు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో పోటీపడుతున్నారన్నారు. మహిళల ఆర్థిక స్వావలం మనకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తోందన్నారు. జిల్లావ్యాప్తంగా షీ టీంలు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలుస్తుంది అన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వమేనలేని కృషి చేస్తుందన్నారు. చిట్కుల్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనకు ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రశంసిస్తూ పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఎంపిపిలు దేవానంద్ కృష్ణ శ్రీ వేణుగోపాల్ రెడ్డి సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి రవీందర్ గౌడ్ జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి సుధాకర్ రెడ్డి కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్లు రోజా బాల్‌రెడ్డి లలిత సోమిరెడ్డి శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్ మహిళా ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధికారులు మహిళా ఉద్యోగులు మహిళలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.