Thursday, January 23, 2025

గ్రామాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

లింగాల : గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చే స్తుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం లింగా ల మండల కేంద్ర ంతో పాటు మండల పరిధిలోని కెసిఆర్ తండా, అంబటిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముం దుగా లింగాల మండల కేంద్రంలో జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కింద రూ.60 లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి, అప్పాయిపల్లి వెళ్లే రహదారిలో రూ.82 లక్షల వ్యయంతో నూతనం గా నిర్మించిన రహదారి, మండల పరిధిలోని కెసిఆర్ తండా గ్రామానికి కోటి 82 లక్షలతో నిర్మించనున్న 2.3 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులకు జెడ్పి చైర్‌పర్సన్ శాంత కుమారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అన ంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రా మాలలో ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం ప్రభు త్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. 60 సంవత్సరాలల కానీ అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో కెసిఆర్ చేసి చూపించారన్నారు. అదే విధంగా గ్రామాల్లో పీర్లచావిడి, వినాయక మండపానికి నాలుగు లక్షలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంబటిపల్లి గ్రామంలో 50 లక్ష ల నిధులతో నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయ నిర్మాణానికి, ఫంక్షన్ హాల్ కోసం 20 లక్షల రూపాయల ఇస్తామని హామీ ఇచ్చారు.

అంతకు ముందు మాజీ సర్పంచ్ పల్లె నిరంజన్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెంది న విషయాన్ని తెలుసుకుని వా రి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌పర్సన్ శాంత కుమా రి, మాజీ జెడ్పిటిసి మాకం తిరుపతయ్య, లింగాల ఎంపిటిసి వసుమతి, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు కేటి తిరుపతయ్య, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, మల్లేష్, రవి శంకర్, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News