Thursday, January 23, 2025

మహిళా సంక్షేమమే సర్కారు ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది
    మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా: మహిళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం జల్‌పల్లి మున్సిపాలిటీలోని ప్రీమియర్ ప్యాలెస్‌లో జిల్లా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రలూ అందించి సన్మానం చేసారు.

మహిళ సంఘాలకు రుణాల చెక్కులు అందించారు. అదే విధంగా షాదీ ముబారక్, కళ్యాణలక్మి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎట్లా ఉండెనో, ఇపుడు ఎట్లా ఉన్నాయో బేరీజు వేసుకోవాలని అన్నారు. అడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

గర్భిణీ మహిళల్లో రక్త హీనత సమస్య తొలగించటానికి, కేరళ రాష్టానికి 11 మంది మహిళ ఐఏఎస్ అధికారులను పంపి న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించి మొదటగా 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన అనంతరం ఈ ఉత్సవాల్లో రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారని, రేపు జరిగే వైద్య దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్ల సేవలు ఎంతో గొప్పవని వారు సమాజంలో అమ్మ పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆర్‌పిల పాత్ర కూడా గొప్పదన్నారు.

12 వేల మంది ఐకెపి గ్రూపుల మహిళలకు స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయల చొప్పున చిరు వ్యాపారాలు చేయటానికి అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహిళల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రెండు వేలు పెన్షన్ అందిస్తూ వృద్ద్ధులకు ఒక భరోసా ఇచ్చారన్నారు.

48 లక్షల మంది పెన్షన్ దారులలో 28 లక్షలు మహిళలే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి వృద్ధ్యాప్యం వరకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు 13 లక్షల మందికి కేసీఆర్ కిట్ అందించినట్లు తెలిపారు. కళ్యాణాలక్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి అడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయలు సహాయం అందిస్తూ ఇప్పటివరకు మహేశ్వరం నియోజకవర్గంలో 15 వేల మందికి అందులో షాదీ ముబారక్ 3 వేల మందికి అందించినట్లు తెలిపారు. షీ టీం లతో మహిళలకు భరోసా లభించిందని, ఇది ఇతర రాష్టాల వారికి ఆదర్శం అయిందని, నేడు జార్ఖండ్ నుంచి షీ టీం అధ్యయనానికి అధికారుల బృందం వస్తుందన్నారు.

మహిళల సైబర్ నేరాలతో పాటు ఇతర మోసాలపై ఫోన్ చేసి సహయం పొందవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతారని, రాచకుండా కమిషనరేట్‌లో హెల్ప్ లైన్ 8712662662ను మంత్రి ప్రారంభించారు. మహిళలకు మహిళ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.540 కోట్ల రుణాలు మహిళ సంఘాలకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జల్ పల్లి చైర్మన్ అబ్దుల్ సాధి, వైస్ ఛైర్మన్ ఫర్హా నాజ్, కందుకూర్ జడ్పీటీసీ జంగారెడ్డి, ఆర్డీవో సూరజ్ కుమార్, డిఆర్డిఏ పిడి ప్రభాకర్ రావు, మహిళ శిశు సంక్షేమ అధికారి పద్మజా, వివిధ శాఖల అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News