Wednesday, January 22, 2025

గ్రామీణ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి,గ్రామీణ సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గుర్రంపోడ్ మండలంలోని జూనూతుల , మక్కపల్లి,పార్లపల్లి, వెంకటేశ్వర నగర్‌లలో సుమారు 20లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చే శారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని అధికారులు, ప్రజా ప్ర తినిధులు పరస్పర సహకారంతో గ్రామాలలో నెల కొన్న సమస్యలపై దృ ష్టి సారించి వాటిని పరిష్కరించాలని, మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలని సూచించారు.

ఈ సందర్భంగా తు నూతుల , మక్కాపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు త్రాగునీరు సక్రమంగా రావడంలేదని ఎమ్మె ల్యే దృష్టికి తీసుకురాగా ,వెంటనే స్పందించిన ఆయన ఫోన్ ద్వారా ఆర్‌డ బ్లూ ఎస్ ఏఈతో మాట్లాడి,మండలంలోని గ్రామ పంచాయితిలకు తా గునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. నేటివరకు ప్రతి గ్రామ పంచాయితికి ప్రభుత్వం 30నుండి 50 లక్షల రూపాయలను వెచ్చించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గతంలో పాలించి న కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించకుండా కాలయాపన చేయడం వ ల్ల నే గ్రామీణ ప్రాంతాలు వెనుకబాటుకు గురయ్యాయని అన్నారు.

రైతులకు 3గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వంను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఎమ్మెల్యే భగత్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో ఎంపిపిల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాయగిరి చంద్రశేఖర్‌రావు, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు దోటి చంద్రమౌళి, స ర్పంచులు జక్కల బాస్కర్ , చాడ చక్రవర్తి, కేసాని యాదగిరిరెడ్డి, పోలె రా మచంద్రం , బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తరి వెంకటయ్య, మేడి వెం క న్న, బొంగరాల శీను, బాస్పాక యాదయ్య, యువజ నాయకులు కృప పృధ్వి, మేకల వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News