Monday, December 23, 2024

పేదల అభ్యున్నతే లక్షంగా ప్రభుత్వ అడుగులు

- Advertisement -
  • ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
    * వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
    కొల్లాపూర్ రూరల్ : పేదల అభ్యున్నతి, సంక్షేమమే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్‌లో సంక్షేమ సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దేశ సంక్షేమ రంగ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర అగ్రభాగాన నిలుస్తుందని అన్నారు. మానవీయ కోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతుందని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. నేడు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఏటా బడ్జెట్‌లో 60 వేల కోట్లకు పైగా కేటాయిస్తుందన్నారు. సంంక్షేమానికి రూ. 2.29 లక్షల కోట్లు గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటవుతుంది, బతుకులు ఆగమైపోతాయని నాడు సమైక్య రాష్ట్రంలో నాయకులు ఎద్దేవా చేశారని, కానీ 9 ఏళ్లలో రాష్ట్రాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. సిఎం కెసిఆర్ సారధ్యంలోని బిఆర్‌ఎస్ సర్కార్ సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, ఆసరా పెన్షన్, కేసిఆర్ కిట్, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
  • అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దళిత బంధు, రైతు సంక్షేమానికి రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ, ఉచిత కరెంట్, ఏ దిక్కులేని వారికి ఆసరాతో అండగా, పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా, కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేల గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమం వెల్లివిరుస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపి సేవలు గణనీయంగా పెరిగాయని అన్నారు. నేషనల్ హైవే 167కె, సోమశిల సిద్దేశ్వరం వంతెన సాధించుకున్నామని అన్నారు. అనంతరం 88 మంది లబ్ధిదారులకు 64 లక్షల 88 వేల రూపాయల సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. అదే విధంగా నియోజకవర్గానికి చెందిన 250 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొల్లాపూర్ 40, బొల్లారం 16, చౌటబెట్లా 40 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు.
  • అనంతరం దళిత బంధు పథకం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్డిఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News