Sunday, December 22, 2024

హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టనున్న అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తారని తెలుస్తుంది. అంతవరకు ఈ ఆర్డినెన్స్ హైడ్రాకు దన్నుగా ఉండనున్నది.రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News