- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు జరుపుకోవాలన్న లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు లేకపోవడంపై అసహనంతో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవటంపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రాజ్‌భవన్‌లోనే గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం గవర్నర్ సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. పుదుచ్చేరిలో గణతంత్ర దినోత్సవంలో పాలొననున్నారు. తెలంగాణలో గణతంత్ర వేడుకలు జరపకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి గవర్నర్ తీసుకెళ్లనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ఇవ్వనున్నారు.
- Advertisement -