- Advertisement -
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలవగా, టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. సిఎం పదవికి జగన్ మంగళవారం రాజీనామా చేయగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా బుధవారం ఎపి అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి జూన్ 16 వరకు ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు రావడం, వైసిపి ఓటమిపాలవడంతో అసెంబ్లీని రద్దు చేయక తప్పలేదు. ఆర్టికల్ 174 అనుసరించి, రాష్ట్ర క్యాబినెట్ సిఫారసుతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -