ఎమ్మెల్సీల విషయమై హైకోర్టు తీర్పుపై చర్చ
ముంబయి: ఎంఎల్‌సి నామినేషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర గవర్నర్ బాధ్యతంటూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే శుక్రవారం సాయంత్రం గవర్నర్ కేంద్ర హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారని రాజ్‌భవన్ వర్గాలు అభివర్ణించాయి. మహారాష్ట్ర క్యాబినెట్ శాసనమండలికి 12 మంది పేర్లతో 8 నెలల క్రితం పంపిన జాబితాపై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో దీనిపై బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదిస్తూ లేదా తిరస్కరిస్తూ గవర్నర్ సకాలంలో నిర్ణయం తీసుకోవడం ఆయన రాజ్యాంగపరమైన బాధ్యతని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది.