Saturday, December 21, 2024

కేంద్రం చేతిలో అస్త్రమే గవర్నర్!

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తిని రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించబడుతున్నారు. దీని అర్ధం రాష్ట్రంలో కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ ఉంటాడు. గవర్నర్‌ను కూడా రాష్ట్రపతి సొంత నిర్ణయంతో తొలగించలేడు. ఆ తొలగింపు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జరుగుతుంది. గవర్నర్ ఏ పార్టీకీ చెందనివాడనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. అది వాస్తవం కాదు. గవర్నర్ల ఎంపిక కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన లేదా అనుకూలమైన, దాని మాట వినే వ్యక్తినే ఎన్నిక చేస్తుంది. నెహ్రూ కాలం నుంచీ నేటి వరకు జరుగుతున్నది అదే. ప్రధాని మోడీ ప్రభుత్వం గవర్నర్ల నియామకం పూర్తిగా తన పార్టీ వారితో నింపి వేసింది. భారత రాజ్యాంగంలో ఫెడరల్ స్వభావం, రాష్ట్రాలకు పరిమిత హక్కులనే కల్పించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్వయం నిర్ణయాధికారం లేదు.

గత కొద్ది సంవత్సరాలుగా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణం. తమకున్న అధికార పరిధులు దాటి రాష్ట్ర ప్రభుత్వాల పై వ్యాఖ్యలు చేయటం, అసెంబ్లీ ప్రారంభ సమావేశ ప్రసంగాల్లో వివాదాల్లోకి వెళ్లటం జరుగుతూ ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలకుల నుంచి అధికారాన్ని చేతులు మార్చుకున్న దేశ పాలకులు, వారి అడుగుల్లో అడుగులు వేస్తున్నారు. రాజ్యాంగ ఏర్పాటులో అది స్పష్టంగా కనిపిస్తుంది. వలస పాలనలో చేసిన అనేక చట్టాలను భారత రాజ్యాంగంలో కూడా పొందుపర్చారు. అవసరం లేని గవర్నర్ వ్యవస్థ అందులో ఒకటి.

బ్రిటిష్ వలస పాలకులు తాము చేసిన చట్టాలను, విధానాలను అమలు జరపటానికి తమ ప్రతినిధిగా గవర్నర్ జనరల్ రూపం లో భారత దేశానికి పంపుతూ ఉండేవారు. గవర్నర్ జనరల్ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా పరిపాలన చేసేవాడు. నేడు దేశంలో ఉన్న గవర్నర్ వ్యవస్థ స్వభావం కూడా అలాంటిదే. భారత రాజ్యాంగంలో యూనిటరీ విధానానికి అనుగుణంగా కేంద్రానికి విస్తృత అధికారాలు కల్పించడం జరిగింది. దాని కింద ఎన్నుకోబడే పార్లమెంటుకు రాష్ట్రపతిని ఎన్నుకోవటం, ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తిని రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించబడుతున్నారు. దీని అర్ధం రాష్ట్రంలో కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ ఉంటాడు. గవర్నర్‌ను కూడా రాష్ట్రపతి సొంత నిర్ణయంతో తొలగించలేడు. ఆ తొలగింపు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జరుగుతుంది.

గవర్నర్ ఏ పార్టీకీ చెందనివాడనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. అది వాస్తవం కాదు. గవర్నర్ల ఎంపిక కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన లేదా అనుకూలమైన, దాని మాట వినే వ్యక్తినే ఎన్నిక చేస్తుంది. నెహ్రూ కాలం నుంచీ నేటి వరకు జరుగుతున్నది అదే. ప్రధాని మోడీ ప్రభుత్వం గవర్నర్ల నియామకం పూర్తిగా తన పార్టీ వారితో నింపి వేసింది. భారత రాజ్యాంగంలో ఫెడరల్ స్వభావం, రాష్ట్రాలకు పరిమిత హక్కులనే కల్పించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి స్వయం నిర్ణయాధికారం లేదు. కేంద్రం అందుకు అనుమతించాలి.పైకి రాష్ట్ర ప్రభుత్వమే పాలన చేస్తున్నట్లు కన్పించినా కేంద్ర ప్రభుత్వానికి లోబడి పాలన చేయాల్సిందే. అందువల్ల ఫెడరల్ స్వభావం నామమాత్రం కలిగి ఉండి రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం కొనసాగుతున్నది.

నెహ్రూ పాలన నుండే గవర్నర్లను తన ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. తనకు ఇష్టంలేని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలద్రోసే కుట్రలు చేస్తూనే ఉంది. 1957 లో కేరళలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెహ్రూ గవర్నర్ చేత రద్దు చేయించారు. ఇందిరా గాంధీ పాలనలో ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయటం జరిగింది. ఇలాంటి పరిణామాలు మోడీ పాలనలో తీవ్రమయ్యాయి. తనకు వ్యతిరేకమైన పార్టీల ప్రభుత్వాలను కూల్చటమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. శాసన సభ్యులను కొనుగోలు చేయటం, ఆశలు చూపటం ద్వారా వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చటం విధానంగా సాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల పతనం ఆ విధంగానే జరిగింది. కూల్చటం సాధ్యంకాకపోతే గవర్నర్ ద్వారా ఆ ప్రభుత్వాలను అస్థిర పర్చే కుట్రలు చేస్తున్నది. మరో 15 నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న సమయంలో తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు మోడీ తీవ్రతరం చేశారు.

అందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లను ప్రయోగిస్తున్నారు.
రాజ్యాంగంలో గవర్నర్ల అధికారాల పరిధి వివరించబడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్ ఎక్కడా మాట్లాడగూడదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇష్టం లేకపోయినా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను వివరించాలి. తన ప్రభుత్వ విధానాలుగా చెప్పాలి. భారత రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పే బిజెపి ఆ పార్టీకి చెందిన గవర్నర్లు ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వారు గొప్పగా చెప్పుకునే భారత రాజ్యాంగం పట్ల బిజెపికి, గవర్నర్లకు విశ్వాసం లేదని అర్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల వ్యాఖ్యలే దాన్ని తెలియజేస్తున్నాయి. చాలా కాలంగా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి బహిరంగ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Governor politics

ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. కేరళ శాసన సభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ తొక్కిపెట్టారు. లోకాయుక్త, యూనివర్శటీ చట్టాల (సవరణ) బిల్లులు ఆమోదించకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానంటున్నారు. యూనివర్శిటీ వ్యవహారాల్లో జోక్యంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనకు పంపిన లేఖలను విడుదల చేసేందుకు రాజ్‌భవన్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్‌పై ఒత్తడి విధానాల వ్యూహాలు ఉపయోగిస్తున్నారని, అసమ్మతి స్వరాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. విలేఖరుల సమావేశానికి ముందు ఆర్‌యస్ యస్ నేతలను గవర్నర్ కలవటం గమనించాలి.

తమిళనాడు శాసనసభ ప్రారంభ సమావేశాల్లో గవర్నర్ ఆర్ యన్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు ఆయన చదవలేదు. అంబేడ్కర్, ద్రవిడ నాయకుల, ద్రవిడ నమూన పాలన, శాంతిభద్రతలకు సంబంధిం చి ప్రస్తావనలు వదలి వేశాడు. తమిళనాడు రాష్ట్ర పేరును వివాదం చేయ ప్రయత్నించారు. స్టాలిన్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టే సమయంలో గవర్నర్ వాకౌట్ చేశారు.

గవర్నర్ వైఖరి తీవ్రవిమర్శలకు గురైంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురిచేసేది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 2021 గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ద్వారా ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాన్ని కల్పించింది. ఢిల్లీ ప్రభుత్వమంటే కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమేనని చట్టం చెబుతున్నది. కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లోబడి ఉండా లి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం ఉంటేనే అమల్లోకి వస్తాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అనేక నిర్ణయాలను గవర్నర్ ఆమోదించకుండా, అమలుగాకుండా చేస్తున్నారు.

బిజెపి వ్యతిరేక పార్టీలు, ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం ఈ పార్టీలు పోటీపడుతున్నాయి, విమర్శించుకుంటున్నాయి. రాష్ట్రా ల హక్కుల కోసం ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా పోరాడలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి తప్ప ఆర్థిక, రాజకీయ విధానాల్లో మోడీ ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలను అణచివేతకు గురి చేస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనాన్ని, గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించటాన్ని బలపర్చాల్సి ఉంది. మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాల ఏర్పాటు లక్ష్యంగా, ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత విధానాలతో ముందుకు పోతూ, రాష్ట్రాల హక్కులను హరిస్తూ, తనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకుంటూపోతున్నది. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ హక్కులను కాపాడుకోవటానికి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్రం జోక్యం లేని స్వయం నిర్ణయ హక్కుల కోసం, గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం కలసికట్టుగా ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News