Thursday, November 14, 2024

ఎందుకు రాజీనామా చేయడం లేదో గవర్నర్ వివరించాలి: మమతా

- Advertisement -
- Advertisement -

సప్తగ్రామ్ (పశ్చిమబెంగాల్ ): వేధింపుల ఆరోపణలు తనపై వచ్చినప్పటికీ గవర్నర్ సివి ఆనందబోస్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదో వివరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. హుగ్లీ నియోజకవర్గం టిఎంసి అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో శనివారం ఆమె మాట్లాడారు. బోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వీధుల్లో అతనిని వీలైతే కలుసుకుంటానన్నారు.

“గవర్నర్ దీదీగిరి చెల్లదని చెబుతుంటారు. కానీ నే చెబుతున్నాను. మిస్టర్ గవర్నర్ మీ దాదాగిరి ఏ విధంగానూ పనిచేయదు” అని మమతా బెనర్జీ గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగిని గత వారం కోల్‌కతా పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 24, మే 2 తేదీల్లో గవర్నర్ హౌస్‌లో తాను వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొంది. మే 9 నాటి రాజ్‌భవన్ సీసీటీవి ఫుటేజీల్లో బోస్ కనిపించారు. దీనిపై వచ్చిన ఆరోపణలను నివారించవలసి ఉందని మమత డిమాండ్ చేశారు. “గవర్నర్ ఎడిట్ చేసిన వీడియో విడుదల చేశారు. నేను పూర్తిగా ఆ వీడియో చూశాను. అందులోని దృశ్యాలు విభ్రాంతి కలిగించాయి. మరో వీడియో కూడా నేను పొందగలిగాను. మీ ప్రవర్తన సిగ్గు చేటు ” అని సిఎం మమతా బెనర్జీ గవర్నర్ తీరును దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News