Sunday, December 22, 2024

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్, తలసాని

- Advertisement -
- Advertisement -

Governor Talasani visiting Subrahmanyeshwara Swami

మన తెలంగాణ/సిటీ బ్యూరో: సికింద్రాబాద్‌లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయాన్ని గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు దర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసైతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ తమళ సై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వామి వారిగా వేర్వేరుగా ప్రత్యేక పూజలే నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ టిఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జీ గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో గవర్నర్ అంటెండర్ మృతి ః
సంద్కరిగి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహా పున ప్రతిష్ట కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఆమె వెంట విధుల్లో భాగంగా అంటెండర్ రాజు సైతం గవర్నర్ వెంట వెళ్లారు. ఇదేక్రమంలో ఆలయంలో విగ్రహాం పున ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న క్రమంలో అంటెండర్ రాజు గుండెపోటుకు గురైయ్యారు. దీంతో అతని హుటాహుటిన గవర్నర్ కాన్వాయ్‌లోనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజు పరిశీలించిన వైద్యులు మార్గమద్యలోనే మరణించినట్లు ధృవీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News