Saturday, December 21, 2024

విసిలతో గవర్నర్ తమిళిసై సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సోమవారం రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సమావేశమ య్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైస్ చాన్సలర్లతో పాటు యుజిసి అధికారులను మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందలేదని సమాచారం. ఇక, ఈ సమావేశం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల అభివృద్దే ప్రధాన లక్ష్యమని చెప్పారు. దేశాభివృద్దికి ఉన్న విద్య అనేది ఒక పిల్లర్ అని అన్నారు.

రాజ్‌భవన్‌లో డిజిటల్ లైబ్రరీలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నానన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆరా తీశారు. విద్యార్థలు ఆత్మహత్యలపై అంతా ఆలోచించాలన్నారు. మంచి ప్రొఫెసర్లు, ట్యాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నా ర్యాకింగ్స్‌లో వెనకబడుతున్నామని అన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా యూనివర్సీటీలు తీర్చిదిద్దాలని చెప్పారు. ఇది ఓపెన్ మీటింగ్ అని ఏ విషయమైనా తనతో చెప్పొచ్చన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News