హైదరాబాద్: కౌషిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేసిన వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాలన్నారు. కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తామని, సిఎం కెసిఆర్ కు నాకు ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని తమిళిసై పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సత్సంబంధాలున్నాయని, గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయంతో ఫైల్ పంపించారని, కానీ ఫైల్ పెండింగ్ లో పెట్టానని, గవర్నర్ కోటలో ఇచ్చే ఎమ్మెల్సీ ఎన్నికకు తనకు కొంత హక్కు ఉంటుందన్నారు. మంత్రివర్గం పంపిన అభ్యర్థి బయోడేటాను పూర్తిగా పరిశీలిస్తున్నానని, గవర్నర్ కోటలో అభ్యర్థి ఏ విధమైన సామాజిక సేవ చేశాడో చూడాలని, కొంత సమయం తీసుకొని నిర్ణయం తీసుకుంటానని తమిళిసై ప్రకటించారు.