Monday, December 23, 2024

నేడు గవర్నర్ ప్రసంగం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు జరుగనున్నాయి. ఉదయం 11:30 కి  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళ సై సౌంధర్ రాజన్  ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ దఫా అభివృద్ధి, సంక్షేమం విషయంలో తమ ప్రాధాన్యాలు ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించనుంది.  సభ వాయిదా అనంతరం స్పీకర్ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న విషయంపై బిఎసి నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News