Wednesday, January 22, 2025

యువకుల బలిదానాలతోనే తెలంగాణ: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటైందని గుర్తు చేశారు. ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై  కాళోజీ మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు.

పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, టిఎస్‌పిఎస్‌సి ద్వారా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాభవన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందని, తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని గవర్నర్ పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం కొత్త ఎంఎస్‌ఎంఇ విధానం ప్రకటించిందని, దావోస్ సమావేశంలో రూ.40 వేల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సింగ్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ అగ్రనేత, యుపిఎ వైఎస్ చైర్మన్ సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందన్నారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించామని తమిళి సై  వివరించారు. శాసన సభ, శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News