Saturday, January 18, 2025

సిఎం కెసిఆర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరిన తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కెసిఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరాభవం అనంతరం కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు.

119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బిఆర్‌ఎస్ 39 స్థానాల్లో గెలవడం లేదా ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ రావడంతో కెసిఆర్ రాజీనామాను సమర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News