Sunday, December 22, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ముగ్గు రు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ఆ మోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో.. న్యాయసలహాలు తీ సుకున్న అనంతరం బుధవారం గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూ చించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా రు. గతంలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. ఈ తరహా ఘటనలు పు నరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వా న్ని కోరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు ఆర్. సత్యనారాయణ, బండి లింగారెడ్డి,

కారం రవీందర్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు రాజీనామా చేసిన చైర్మన్, సభ్యుల్లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నియామకం కాగా, అప్పట్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, నిరుద్యోగుల ఆందోళనలు రాష్ట్రంలో
సంచలనంగా మారాయి. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిఎస్‌పిఎస్‌సిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సమీక్షను నిర్వహించారు. ఆ వెంటనే ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు సుమారు రెండు వారాలకుపైగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా గవర్నర్ కోరారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ లేఖ, న్యాయ నిపుణుల సలహా అనంతరం ఈ మేరకు తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ నలుగురి రాజీనామాలకు బుధవారం ఆమోద ముద్ర వేశారు. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదంతో గవర్నర్ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మంగళవారమే పంపించారని వెంటనే బుధవారం గవర్నర్ ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది.
కొనసాగుతున్న ఇద్దరు సభ్యులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులు ఉండగా, అందులో చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా, వారి రాజీనామాలను తాజాగా గవర్నర్ ఆమోదించారు. మిగతా ఇద్దరు సభ్యులు తనోబ సుమిత్రా ఆనంద్, కోట్ల అరుణ కుమారిలు కమిషన్‌లోనే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చైర్మన్, ముగ్గరు సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలిన ఇద్దరు సభ్యులు కమిషన్‌లోనే కొనసాగుతారా..? లేక మరికొంత వేచిచూసి వీరు కూడా రాజీనామా చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

త్వరలో కొత్త చైర్మన్
టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషనన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేసి స్పష్టతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన పలు పరీక్షలు పూర్తయినా కమిషన్ ఫలితాలు ప్రకటించలేదు. టిఎస్‌పిఎస్‌సికి కొత్త చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే పలు పరీక్షల ఫలితాలు, గ్రూప్ 2 సహా మరికొన్ని పోటీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది. ఛైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని గతంలో హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ సహా పదిమంది సభ్యులను నియమించేందుకు అవకాశం ఉంటుంది.

గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన సభ్యులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్య పదవులకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌కు సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిలు ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీ కాలంలో విధి నిర్వహణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, టిఎస్‌పిఎస్‌సి అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తాము గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో నిబంధనలకు అనుగుణoగా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా, రాజ్యాంగం నేర్దేశించిన విధులను నిర్వహించామని, తమ విధుల నిర్వహణ కాలంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News