Monday, December 23, 2024

టిఎస్ ఆర్టీసి బిల్లుకు గవర్నర్ ఆమోదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆదివారం రాజ్ భవన్ లో రవాణా శాఖ అధికారులతో ఆర్టీసి బిల్లుపై గవర్నర్ చర్చించారు. ఆర్టీసి బిల్లుపై గవర్నర్ సందేహాలకు ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. అధికారులు వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ శాసనసభలో ఆర్టీసి బిల్లు ప్రవేశపెట్టేందుకు సమ్మతించారు. బిల్లుతోపాటు ఉద్యోగుల ప్రయోజనాలు, న్యాయపర అంశాల వంటి 10 అంశాలను ప్రభుత్వానికి గవర్నర్ సిఫారసు చేశారు. గవర్నర్ ఆమోదించడంతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News