Monday, December 23, 2024

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతి: 48గంటల్లో నివేదిక ఇవ్వాలని తమిళిసై ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక కోరారు. బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ విసి వెంకటరమణను 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని శుక్రవారం గవర్నర్ ఆదేశించారు. విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె కోరారు. దురదృష్టకర ఘటనల నివారణకు చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటిలో వరుస ఆత్మహత్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్ చాన్సిలర్‌ను సూచించారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News