Tuesday, April 29, 2025

నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారు: గవర్నర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాడీ షేమింగ్ కామెంట్‌పై గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మీడియాతో మాట్లాడారు. నల్లగా ఉన్నానంటే అగ్గిలా మారుతానని తమిళి సై తెలిపారు. తన శరీర ఛాయను అదే పనిగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఓర్వలేని స్థాయికి చేరుతానని స్పష్టం చేశారు. గతంలో గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కే పరిమితం కావాలి కానీ బిజెపి తరపున రాజకీయాలు చేయడం ఏంటని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి బిఆర్‌ఎస్ వర్సెస్ గవర్నర్ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News